Mowgli Movie | బబుల్గమ్’ (Bubblegum) అంటూ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించాడు టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala), యాంకర్ సుమ (Anchor Suma)ల తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala). క్షణం సినిమా ఫేమ్ రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) దర్శకత్వం వహించిన ఈ చిత్రం రోమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత చాలా రోజుల గ్యాప్ తీసుకున్న రోషన్ తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. కలర్ ఫొటో(Color Photo) వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రాజ్‌తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు రోషన్.
ఈ సినిమాకు మౌగ్లీ (Mowgli) అనే సూపర్ హీరో టైటిల్ పెట్టారు మేకర్స్. అప్పుడెప్పుడో వినాయక చవితి కానుకగా ఈ ప్రాజెక్ట్ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. ముహుర్తపు షాట్‌ను యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొట్టగా.. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సమ్మర్ 2025 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాలా భైరవ సంగీతం అందిస్తున్నాడు.
Highlights from the #Mowgli2025 grand pooja ceremony ✨
▶️ https://t.co/wvkxkhlbEp#Mowgli @peoplemediafcy pic.twitter.com/KVtjexRYOt
— TollywoodBoxoffice.IN (@TBO_Updates) December 19, 2024