ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ యువ హీరోలు నిఖిల్, నితిన్ (Nithiin) . చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్ నటిస్తున్న చిత్రం కార్తికేయ 2 (Karthikeya 2). నితిన్ నటిస్తోన్న ప్రాజెక్టు మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). ఆగస్టు 12న నితిన్ సినిమా విడుదలవుతుండగా..ఆ మరుసటి రోజు ఆగస్టు 13న నిఖిల్ చిత్రం రిలీజవుతుంది. కాగా ఈ రెండు సినిమాలా టికెట్ల ధరలు ఎలాంటి మార్పు లేకుండా రెగ్యులర్‌గానే ఉండనున్నాయి.
ఈ రెండు సినిమాల టికెట్ల ధరలు గమనిస్తే..సింగిల్ స్క్రీన్స్ రూ.147 (ఏపీ), రూ.150 (టీఎస్), మల్టీప్లెక్స్ థియేటర్లు : రూ.177 (ఏపీ), రూ.200 (టీఎస్)గా ఉన్నాయి. ఈ రెగ్యులర్ ధరలతో సినిమా థియేటర్లకు ప్రేక్షకుల రాక కూడా పెరిగే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
మిస్టరీ థ్రిల్లర్ గా వస్తున్న కార్తికేయ 2లో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ చిత్రానికి కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్. మాచెర్ల నియోజకవర్గం ప్రాజెక్టును ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా..రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.