టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మంచి నటుడిగానే కాదు మానవతావాదిగాను మహేష్‌ని ఎంతగానో ఇష్టపడుతుంటారు. రెండు గ్రామాలని దత్తత తీసుకున్న మహేష్.. వారి కోసం ఎంతో చేస్తుంటారు. చిన్నారులకి ప్రత్యేక వైద్యం కూడా ఇప్పిస్తుంటారు. సూపర్ స్టార్‌కి మన తెలుగు రాష్ట్రాలలోనే కాక ఇతర ప్రాంతాలలోను అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఆగస్ట్ 9న మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయనకు ఎందరో ప్రముఖులు శుభాకాంక్షల వెల్లువ కురిపించారు. మహేష్ కూడా తన ఫ్యాన్స్ కోసం సర్కారు వారి పాట టీజర్ విడుదల చేస్తూ.. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.అయితే మహేష్ బర్త్ డే సందర్భంగా అభిమానులు ఆయనపై ప్రేమను కురిపిస్తూ శుభాకాంక్షలు అందించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఓ దివ్యాంగురాలు తన నోటితో మహేష్ స్కెచ్‌ని ఎంతో అందంగా గీసి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మహేష్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ స్పేస్ లో 20 మందికి పైగా సెలబ్రిటీ లు మహేష్ బాబు తో తమకు ఉన్న అనుభవాలను షేర్ చేసుకోవడం మాత్రమే కాకుండా, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలా జరగడం టాలీవుడ్ లో ఇదే మొదటి సారి అని తెలుస్తోంది. ఈ విషయం తెలియడం తో మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Hello sir my best wishes 💖 @urstrulyMahesh garu happy birthday.. god bless you sir..my mouth pencil artwork for you..#MaheshBabu #birthdaywishes .#mouthart .@MaheshBabu_FC .@MaheshBabu_UF ..@maheshbabuforu ..@Abhishek_kunche .@PrinceMaheshFc . pic.twitter.com/JSApUylf0x
— @mouth Artist Swapnika (@PawanSister) August 9, 2021