మౌళి తనూజ్, శివాజీ నాగారం జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకుడు. ఆదిత్య హాసన్ నిర్మాత. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్‌లో సినిమా రూపొందింది. సెప్టెంబర్ 5న నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వారా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.
సెప్టెంబర్ 12న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మొదట్లో ప్రకటించారు. అయితే.. ఇప్పుడు ఒక వారం ముందుగానే థియేటర్లలోకి తెస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ స్పందిస్తూ.. ‘ప్రచార చిత్రాల కారణంగా సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు ఏర్పాడ్డాయి. ఆ నమ్మకంతోనే ఓ వారం ముందుగానే వస్తున్నాం. మా ‘లిటిల్ హార్ట్స్’ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుంది.’ అని తెలిపారు. రాజీవ్ కనకాల, ఎస్.ఎస్.కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ తదితరులు ఇతరపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సూర్య బాలాజీ, సంగీతం: సింజిత్ యెర్రమల్లి.