Skanda Movie | వినాయక చవితి వీక్‌పై మొదట ఖర్చీఫ్ వేసింది స్కంద సినిమానే. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించాడు. ఈ సినిమాపై మాస్ ఆడియెన్స్‌లో మాములు ఎక్స్పెక్టేషన్స్ లేవు. బోయపాటి వైలెన్స్ ఈ సారి ఊహించిన దానికంటే అరివీర భయంకరంగా ఉండబోతుందని గ్లింప్స్, ట్రైలర్లు గట్రా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాయి. ఇక బీ, సీ సెంటర్లకు వచ్చే ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు కూడా చెప్పేశాయి. సెప్టెంబర్ 15న రెండు అరవ సినిమాలకు పోటీగా ఈ సినిమా రిలీజవుతుంది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా పోస్ట్ పోన్ కానుందని తెలుస్తుంది. సెప్టెంబర్ చివరి వారంలో రిలీజయ్యే సలార్ ఎలాగో పోస్ట్ పోన్ కాబోతుంది. అఫీషియల్‌గా ప్రకటన రాలేదు కానీ ఆల్మెస్ట్గా సలార్ పోస్ట్ పోన్ అయినట్లే అని ఇండస్ట్రీ వర్గాల టాక్. కాగా అదే డేట్‌ను ఈ సినిమా రీప్లేస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రేపో మాపో ఈ డేట్‌ను అధికారికంగా కూడా ప్రకటించబోతున్నట్లు టాక్. ఇక ఇప్పటికే ఆ డేట్‌పై రూల్స్ రంజన్ సహా విజయ్ ఆంటోని కొత్త సినిమా కూడా ఖర్చీఫ్ వేసింది. అయితే అవి పెద్దగా బజ్‌లేని సినిమాలు. దాంతో అదే రోజున స్కంద కూడా రావాలని ఫిక్సయిందట. పైగా చంద్రముఖి సీక్వెల్, మార్క్ ఆంటోని సినిమాలపై ఇక్కడ కూడా మంచి హైపే నెలకొంది.
పోటీ ఎందుకులే అని భావించి స్కంద టీమ్ రెండు వారాలు వెనక్కి వెళ్లనుందట. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాకు ఇప్పటికే ఓ రేంజ్లో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. స్టార్ సంస్థ సౌత్‌లోని అన్ని భాషల నాన్-థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.50 కోట్లకు కొనుక్కుందని టాక్.