Most Awaited Movies | ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నాయి. ప్రతి సినిమా కూడా రికార్డులని బ్రేక్ చేసేలా చిత్రీకరించబడుతుంది. అయితే పురాణేతిహాసం ‘రామాయణం’ ఆధారంగా ‘దంగల్’ ఫేం నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం -1, రామాయణం -2 చిత్రాలపై అందరిలో చాలా ఆసక్తి నెలకొంది. అందుకు కారణం ఇందులో బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తుండడం. ఇందులో రావణాసురుడి పాత్ర పోషిస్తున్న యష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. దాదాపు ఈ చిత్రాలని రూ.4000 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్టు టాక్.
రావణాసురుడి పాత్ర ప్రేక్షకులకి పిచ్చెక్కించనుందని అంటున్నారు. ఇప్పటికే 70రోజుల పాటు రావణాసురుడి పాత్రపై చిత్రీకరణ సాగినట్టు వార్తలు రావడంతో రాముడు, లక్ష్మణుడు, సీతల పాత్రకి సంబంధించిన సన్నివేశాలు కూడా దాదాపు పూర్తైనట్టు తెలుస్తుంది. ఇక ఇందులో కునాల్ కపూర్ ఇంద్రదేవుని పాత్ర పోషిస్తున్నాడు. ఈ మధ్య రావణ్, ఇంద్ర దేవుని మధ్య పోరాటంకి సంబంధించిన సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, సన్నీడియోల్ ఆంజనేయుడి పాత్రను పోషిస్తున్నారు. 2026 దీపావళికి తొలి భాగం రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
ఇక రెండో భాగం 2027లో విడుదల కానుంది. అయితే రామాయణంకి సంబంధించి అనేక సీరియల్స్, సినిమాలు వచ్చాయి. అయితే ఎన్నిసార్లు రామాయణం వచ్చిన ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మాత్రం కాస్త తేడా కొట్టింది. ఈ సినిమాలో చేసిన తప్పులు నితీష్ చేయకుండా రామాయణం చిత్రాలని టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ అవెంజర్స్, అవతార్ రేంజులో తెరకెక్కించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రామాయణంలో ఎన్నో కథలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో కథని బేస్ చేసుకొని సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు నితీష్ దేనిని బేస్ చేసుకొని సినిమాలు తీస్తున్నాడనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. రావణ- రాముడి పోరాటాలు, యుద్ధాలపైనా? ఏమోషన్స్ పైనా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.