Mosagallaku Mosagadu Movie Re-Release Trailer | ఇప్పుడు మనం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలంటూ గొప్పగా చెప్పుకుంటున్నాం.. కానీ సూపర్ స్టార్ కృష్ణ 50ఏళ్ళ క్రితమే మోసగాళ్లకు మోసగాడుతో పాన్ వరల్డ్ సినిమా తీసి టాలీవుడ్ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు. ఈ చిత్రం తమిళంలో ‘మొసక్కరనుక్కు మొసక్కరన్’, హిందీలో ‘గన్‌ఫైటర్ జానీ’ పేరుతో రిలీజైంది. ఇక్కడ ఈ సినిమాకు అనూహ్య స్పందన రావడంతో, కృష్ణ ఈ సినిమా నిడివిని తగ్గించి ‘ది ట్రెజర్ హంట్’ పేరుతో ఇంగ్లీష్ వెర్షన్లో రిలీజ్ చేశాడు. అక్కడ కూడా ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఇలా తెలుగు నుండి ఇంగ్లీష్‌కు డబ్ అయిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా మే 31న 4K ప్రింట్‌తో రీ-రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మహేష్‌బాబు ఈ సినిమా రీ-రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.
రీ-రిలీజ్ ట్రైలర్ కొత్తగా అనిపిస్తుంది. ట్రెండ్‌కు తగ్గట్లుగా మేకర్స్ ట్రైలర్‌ను కట్ చేశారు. అంతేకాకుండా క్వాలిటీ కూడా అద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు చిరు.. ఆ తర్వాతి తరం హీరోల సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కాగా తొలిసారి ఒక సీనియర్ హీరో, అది కూడా ఐదు దశాబ్ధాల క్రితం వచ్చిన సినిమాను రిలీజ్ చేయనుండటం గమనార్హం. కే.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ద గుడ్, ద బ్యాడ్ అండ్ అగ్లీ’ అనే హాలీవుడ్ మూవీను బేస్ చేసుకుని రూపొందింది. 1971 ఆగస్టు 27లో తొలి ఇండియన్ కౌబాయ్ చిత్రంగా రిలీజైన ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 50లక్షల గ్రాస్‌ను కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత 50లక్షల గ్రాస్ సాధించి మూడో హీరోగా కృష్ణ నిలిచాడు.
A timeless gem… and one of my all-time favourites! Thrilled to bring it back on the big screen once again! This one’s for all the fans! 🤗
Presenting the re-release trailer of #MosagallakuMosagadu! In cinemas from May 31st. https://t.co/qPeLGvOuYd
— Mahesh Babu (@urstrulyMahesh) May 22, 2023