Mokshagna | బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రానికి రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి చిత్రం తెరకెక్కనుంది. అయితే.. ఇది ఏ తరహా సినిమా అనేది అభిమానుల్లో నెలకొని ఉన్న ప్రశ్న. సాధారణంగా నందమూరి అభిమానులు మాస్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడతారు. మరి మోక్షజ్ఞని ప్రశాంత్‌వర్మ మాస్ అవతార్‌లోనే ప్రజెంట్ చేస్తున్నాడా?.. అంటే.. ఫిల్మ్ వర్గాలు కాదనే చెబుతున్నాయి.
ఈ సినిమాలో మోస్ట్ రొమాంటిక్‌గా మోక్షజ్ఞని చూపించబోతున్నారట ప్రశాంత్‌వర్మ. అందుకు తగ్గట్టుగా రొమాంటిక్ లవ్‌స్టోరీనే ఆయన ఎంచుకున్నారట. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక పాత్రలో బాలకృష్ణగానీ, కల్యాణ్రామ్గానీ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇందులో హీరోయిన్గా ముందు శ్రీలీల పేరు వినిపించింది. కానీ.. దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆలోచన మాత్రం వేరేలా ఉందట. కచ్చితంగా హిట్ కొట్టాలనే తలంపుతో.. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌కి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు ప్రశాంత్‌వర్మ. దసరా రోజున ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రెగ్యులర్ షూటింగ్‌కి మాత్రం టైమ్ పట్టేలా ఉందని సమాచారం.