Mokshagna | నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు అంటున్నారే తప్ప మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి పూర్తి క్లారిటీ రావడం లేదు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమాను అనౌన్స్ చేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ పలు కారణాల వలన ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ నుండి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడని, అందుకే ఇది ఆగిందని కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత మోక్షజ్ఞ కోసం డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ మంచి కథను రెడీ చేశారని, ఈ కథ బాలయ్య కూడా విన్నారని ..దాంతో వెంకీతో మోక్షజ్ఞ సినిమా ఫిక్స్ అయినట్టు ఫిలిం నగర్లో ప్రచారాలు సాగాయి.
మరోవైపు బాలయ్య సూపర్ హిట్ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ.. హీరోగా ఎంట్రీ ఇస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది.కట్ చేస్తే రీసెంట్గా ఢిల్లీలో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు సందర్భంగా మోక్షజ్ఞ తన ఫ్యామిలీతో కలిసి ఫొటోలు దిగారు. అందులో మోక్షజ్ఞ లుక్ చాలా డిఫరెంట్గా కనిపించింది. ప్రశాంత్ వర్మ సినిమా కోసం విడుదలైన పోస్టర్లలో మోక్షజ్ఞ లుక్ అందరిని ఆకట్టుకుంది. కాని ఇప్పుడు ఈ ఫొటోలో చూస్తే ఏదో తేడా కొడుతుంది. అతని లుక్ పూర్తిగా మారిపోవడంతో మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడానికి ఇంకా సమయం తీసుకుంటున్నాడా అనే ఆలోచన అభిమానుల మదిలో మెదులుతుంది.
మరోవైపు మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ.. మోక్షుకి జంటగా నటిస్తుందని టాక్ నడుస్తుంది. ఏది ఏమైన మోక్షజ్ఞ సినిమాల ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో నందమూరి అభిమానులు అప్సెట్ అవుతున్నారు. త్వరగా ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి మహాప్రభో అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.