Mokshagna | మోక్షజ్ఞ తొలి సినిమా కోసం రంగంలోకి మరో డైరెక్టర్.. ఇప్పటికైన మోక్షం వచ్చినట్టేనా?
Mokshagna | నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమాను అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ పలు కారణాల వలన ఆగిపోయిందని తెలుస్తుంది.
Mokshagna | నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమాను అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ పలు కారణాల వలన ఆగిపోయిందని తెలుస్తుంది. కారణాలు అయితే ఇప్పటి వరకు బయటకు రాలేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్ నుంచి ఔట్ అయ్యాడని, అందుకే సినిమా ఆగిపోయిందని టాక్ గట్టిగా వినిపించింది. కాని ఇంత వరకూ అఫీషియల్ గా మాత్రం ఏ విషయం బయటకు రాలేదు.
మోక్షజ్ఞ కోసం డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ మంచి కథను రెడీ చేశారని తెలుస్తోంది. ఈ కథ బాలయ్య కూడా విన్నారని ..దాంతో వెంకీతో మోక్షజ్ఞ సినిమా ఫిక్స్ అయినట్టు సమాచారం. మరోవైపు బాలయ్య సూపర్ హిట్ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ.. హీరోగా ఎంట్రీ ఇస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా ఆ విషయంపై ఆదిత్య 369 డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు స్పందించారు. తమ మూవీ సీక్వెల్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు. అందుకే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాం. ఆదిత్య 369 సీక్వెల్ తో బాలయ్య.. మోక్షును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకుంటున్నారు.
ఎప్పటికైనా సీక్వెల్ చేయాలని మాత్రం బాలయ్య మనసులో ఉంది. అంటే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్ ఉంటుందని అర్ధమవుతుంది. అయితే వెంకీ అట్లూరి మోక్షజ్ఞ కోసం ప్రత్యేకంగా ఒక స్టోరీ సిద్ధం చేసినట్లు సమాచారం. బాలకృష్ణ కూడా ఈ సినిమా స్టోరీ వినాలనుకుంటున్నారని, కథ నచ్చితే వెంటనే సినిమా షూటింగ్ పనులు ప్రారంభం అవుతాయని తెలుస్తుంది. ఈ సినిమాలో మోక్షజ్ఞ లవర్ బాయ్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇలా మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త వస్తున్నప్పటికీ ఆయన ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారనేది సస్పెన్స్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

