మోహన్‌లాల్, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘తుడరుమ్’. తరుణ్‌మూర్తి దర్శకుడు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. దీపా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. మంగళవారం తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో మోహన్‌లాల్ ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించారు. ఆయన కారును పోలీసులు సీజ్ చేస్తారు? అందుకు కారణాలు తెలుసుకునే క్రమంలో ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా సాగింది. ఓ కారు, ఫ్యామిలీ చుట్టూ అల్లుకున్న కథ ఇదని అర్థమవుతున్నది. ఈ చిత్రానికి కథ: కేఆర్ సునీల్, సంగీతం: జేక్స్‌బిజోయ్, నిర్మాత: ఎం.రంజిత్, దర్శకత్వం: తరుణ్‌మూర్తి.