Mohanlal New Movie | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ మూర్తి కాంబినేషన్లో మరో భారీ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. వీరిద్దరి కలయికలో 2025లో వచ్చిన ‘తుడరుమ్’ (Thudarum) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. అయితే ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ జత కడుతుండటంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కేరళతో పాటు సౌత్ ఇండియా అంతటా భారీ అంచనాలు నెలకొన్నాయి. #L366 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ నేడు అధికారికంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మోహన్‌లాల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా కాలం తర్వాత ఆయన పూర్తిస్థాయి ఖాకీ దుస్తుల్లో నటిస్తుండటం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. సీనియర్ నటి మీరా జాస్మిన్ ఇందులో కథానాయికగా నటిస్తుండగా, ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రతీష్ రవి కథను అందించిన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం, షాజీ కుమార్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. ఒకవైపు ఈ చిత్రం ప్రారంభం కాగా, మరోవైపు మోహన్‌లాల్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘దృశ్యం 3’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 2, 2026న విడుదలకు సిద్ధమవుతుంది.
Starting this journey with gratitude as I join the sets of #L366. Thankful for all your blessings and prayers. pic.twitter.com/tWi3qVjv0P
— Mohanlal (@Mohanlal) January 23, 2026