L3 | పాన్ ఇండియా క్రేజ్ ఉన్న మాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల్లో టాప్‌లో ఉంటారు మోహన్‌లాల్ (Mohanlal), పృథ్విరాజ్ సుకుమారన్ (Pridviraj Sukumaran). ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన చిత్రం L2 : Empuraan. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ లీడ్ రోల్లో నటించగా.. పృథ్విరాజ్ సుకుమారన్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించారు.
మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఓ వైపు ఈ సినిమాను పలు వివాదాలు చుట్టుముడుతుండగా.. మరోవైపు మూడో పార్టుకు సంబంధించిన ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అతి త్వరలోనే పృథ్విరాజ్ సుకుమారన్ థర్డ్ పార్ట్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాడని.. దీనికి L3 టైటిల్ ఖరారు చేశాడని ఇండస్ట్రీ సర్కిల్లో ఓ వార్త రౌండప్ చేస్తోంది.
కాగా ఈ సారి థర్డ్ ఇన్స్టాల్మెంట్లో మరో క్రేజీ యాక్టర్ ఉండబోతున్నాడట. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరో కాదు మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్. ఈ కథాంశం తీవ్రంగా ఉంటుందని, అబ్రహం ఖురేషి అలియాస్ స్టీఫెన్ నేడుంపల్లి అలియాస్ లూసిఫర్ 1982 లో ముంబైకి వచ్చి తన మాఫియా సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ప్రయాణాన్ని ట్రాక్ చేసే నేపథ్యంలో థర్డ్ పార్టు ఉండబోతుందంటూ కథనాలు తెరపైకి వస్తున్నాయి.
దీనికి సంబంధించి రెండో పార్టు చివరలో లీడ్‌పై హింట్ కూడా ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ సారి L3లో వివాదాలను నివారించడానికి మేకర్స్ స్క్రిప్ట్ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Pranav Mohanlal
Jailer 2 | జైలర్2 క్రేజీ అప్డేట్.. బాలయ్య, సూర్య మధ్య బీభత్సమైన సన్నివేశాలా?