మలయాళ అగ్రనటుడు మోహన్‌లాల్ నటించిన చారిత్రాత్మక పానిండియా చిత్రం ‘వృషభ’. నందకిశోర్ దర్శకుడు. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె.పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్‌సింగ్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా నిర్మాతలు. ఈ నెల 25న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం తెలుగులో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తున్నదని, ఓ గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని, మోహన్‌లాల్ నటవిశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడొచ్చని మేకర్స్ చెబుతున్నారు. సమర్జీత్ లంకేశ్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడరామ్, వినయ్‌వర్మ, అలీ, అయ్యప్ప పి.శర్మ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: ఎస్.ఆర్.కె, జనార్దన మహర్షి, కార్తీక్, కెమెరా: ఆంటోనీ సామ్సన్, సంగీతం: సామ్ సీఎస్, అరియన్ మెహెదీ.