Malaikottai Valiban | మలయాళంతోపాటు తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal). ప్రస్తుతం అభిమానులను ఎంటర్టైన్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ సీనియర్ హీరో. మోహన్ లాల్ నటిస్తోన్న క్రేజీయెస్ట్ ప్రాజెక్టుల్లో ఒకటి మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆరు పదుల వయస్సులోనూ మోహన్ లాల్ కండలు తిరిగిన దేహంతో గుబురు గడ్డం గెటప్‌లో.. భారీ తాడును లాగుతున్న స్టిల్ మూవీ లవర్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తోంది. కాగా మోహన్‌లాల్ అభిమానులకు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటేంటే మలైకోటై వాలిబన్ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా లొకేషన్లో తీసిన మోహన్ లాల్ బ్యాక్ లుక్ స్టిల్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నట్టు తెలియజేశారు మేకర్స్.
ఈ అప్డేట్తో మలైకోటై వాలిబన్ ఇక అతి త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతున్నట్టు క్లారిటీ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్ లాల్ మరోవైపు Ram: Part 1 లో నటిస్తుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతోపాటు మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
It’s a wrap up for much Awaited #MalaikottaiVaaliban
Post-production work starts soon #Mohanlal pic.twitter.com/JpnJGBVirN
— Forum Reelz (@ForumReelz) June 13, 2023