Mohanlal | దేశం గర్వించదగ్గ మహానటుల్లో మోహన్‌లాల్ ఒకరు. తను మలయాళీ నటుడైనా.. అన్ని భాషల్లోనూ ఆయన నటనకు అభిమానులున్నారు. ప్రస్తుతం హృదయపూర్వం, హృషభ, దృశ్యం 3 చిత్రాలతో బిజీగా ఉన్నారు మోహన్‌లాల్. తెలుగులో ఆయన ప్రత్యేక పాత్ర పోషించిన ‘కన్నప్ప’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇదిలావుంటే.. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు మోహన్‌లాల్.
‘శరీరంలో సత్తువ ఉన్నంత వరకూ మనిషి పనిచేయాలి. ఆరోగ్యంగా ఉండి కూడా విశ్రాంతి తీసుకునేవాళ్లను సోమరిపోతులు అంటారు. నావరకూ నేను ఎప్పుడూ బిజీగా ఉంటా. ఒక సినిమా చేస్తూ నాలుగు సినిమాలకు ఓకే చెబుతుంటా. పనిచేస్తూ ఉండటం నాకిష్టం.’ అని చెప్పుకొచ్చారు మోహన్‌లాల్. తన కోరిక గురించి చెబుతూ ‘మముట్టికీ, నాకూ మధ్య పోటీ ఉందని అందరూ అనుకుంటారు.
నిజానికి మా మధ్య ఉన్నది పోటీ కాదు.. స్నేహం. తను నా ప్రాణ స్నేహితుడు. రోజుకి ఒక్కసారైనా తనతో మాట్లాడకపోతే నాకు తోచదు. తనక్కూడా అంతే. మేమిద్దరం కలిసి ఇప్పటికి 50 సినిమాల్లో నటించాం. ఇంకా మరిన్ని చిత్రాల్లో తనతో కలిసి నటించాలనేది నా కోరిక.’ అన్నారు మోహన్‌లాల్.