Mohanlal | మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన మలయాళ నటుడు అయిన తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మోహన్ లాల్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అయి మంచి విజయం సాధించాయి. అలానే మోహన్ లాల్ చేసిన చాలా సినిమాలని మనోళ్లు రీమేక్ చేసి పెద్ద హిట్ కొట్టారు. తాజాగా మోహన్‌లాల్ హీరోగా ఎంపురాన్ సినిమాను పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎంపురాన్ చిత్రం మార్చి 27న థియేటర్లోకి వచ్చింది.ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతుంది.
ఇక సెలబ్రిటీలకి రక్షగా బౌన్సర్స్ ఉంటారనే విషయం మనందరికి తెలిసిందే. సాధారణంగా ఈ బౌనర్స్ ఎక్కువగా జంట్స్ ఉంటారు. కాని మోహన్ లాల్‌కి మాత్రం రక్షణగా లేడి బౌన్సర్ ఉంటుంది. ఈమె కేరళలోని ప్రసిద్ధ మహిళా బౌన్సర్ కాగా ఆమె పేరు అను కుంజుమన్. చాలా సంవత్సరాలుగా ఈమె బౌన్సర్‌గా పని చేస్తుండగా, సెలబ్రిటీలకి భద్రత కల్పించడంతో దిట్ట. నల్లటి టీ-షర్టు, జీన్స్ వేసుకుని ఆమె కాన్ఫిడెంట్ గా వస్తుంటే, గొడవ చేసే వారు కూడా సైడ్ ఇస్తారు. కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో భద్రత కోసం వచ్చినప్పుడు ఆమె నిలబడిన తీరు, ఆజ్ఞాపించే విధానం అందరి దృష్టిని ఆకర్షించాయి. కేరళలో ప్రొఫెషనల్ బౌన్సర్‌గా తన ముద్ర వేస్తున్న అను కుంజుమన్ మగవాళ్ల ఆధిపత్యాన్ని బద్దలు కొట్టింది అనే చెప్పాలి.
37 ఏళ్ల అను కుంజుమోన్ బౌన్సర్ ఎందుకు అవ్వాలని అనుకుంది అనే ఆలోచన అందరి మదిలో మెదులుతుంది. అయితే ఆమె వ్యక్తిగత అనుభవాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుందట.గతంలో ఆమె ఫొటోగ్రాఫర్‌గా పని చేసేది. ఎక్కువగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు, సెలబ్రిటీ పార్టీలని కవర్ చేస్తూ ఉండేది. అయితే ఓ కార్యక్రమంలో మగ బౌన్సర్‌తో జరిగిన గొడవ వలన తాను బౌన్సర్ కావాలనే నిర్ణయం తీసుకుందట. తాను ఎదిగే క్రమంలో ఎన్నో సవాళ్లని ఎదుర్కొంది. గౌరవంగా బ్రతకడానికి ఎంతో కష్టపడుతూ.. ఆమె తన తల్లి, సోదరి బాధ్యత తీసుకున్నారు. ఇన్నేళ్లలో కుంజుమన్ సెలబ్రిటీల కార్యక్రమాల నుంచి హై-ఎనర్జీ పబ్ పార్టీల వరకు చాలా కార్యక్రమాల్లో పనిచేశారు. మహిళా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలకు రక్షణగా ఉన్నారు.