మార్మిక ఆధ్యాత్మిక గురువుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు ఓషో. మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్…ఓషోను తన ఆధ్యాత్మిక గురువుగా చెబుతుంటారు. తాజాగా ఓషో జీవితంతో మోహన్‌లాల్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఓషో ఫొటో ముద్రించి ఉన్న షర్ట్‌ను మోహన్‌లాల్ ధరించి కనిపించారు. ఈ ఫొటోలో మోహన్‌లాల్ ఓషో పోలికలతో కనిపించడంతో అతడు సినిమా చేస్తున్నది నిజమేనంటూ నెటిజన్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నట్లు సమాచారం.