మోహన్‌లాల్ ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలూ మంచి విజయాలను సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 2013లో వచ్చిన ‘దృశ్యం’ తొలి పార్ట్ అయితే.. ఇతర భాషల్లోనూ రీమేక్ అయి, రీమేక్ అయిన ప్రతి భాషలోనూ విజయాన్ని అందుకుంది. త్వరలో ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో సినిమా రానుంది. తొలి రెండు భాగాలను మించిన క్రైమ్ థ్రిల్లర్‌గా దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ ‘దృశ్యం3’ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారని సమాచారం. ‘దృశ్యం’ కథను కొనసాగిస్తూ మూడో భాగం కూడా ఉంటుందని దర్శకుడు గతంలోనే చెప్పాడు.
చెప్పిన మాట ప్రకారం మూడేళ్ల విరామం తర్వాత ‘దృశ్యం3’ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు జీతూ జోసెఫ్. దీంతో హీరో మోహన్‌లాల్ ఈ విషయాన్ని ధృఢ పరుస్తూ ‘గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. ‘దృశ్యం-3’ రాబోతోంది..’ అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోని పెరుంబరవూర్లతో కలిసి ఆయన దిగిన ఫొటోని కూడా పంచుకున్నారు.