Vrusshabha | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘వృషభ’. ఈ సినిమాకు నంద కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా.. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్. వ్యాస్ స్టూడియోస్, ఆశీర్వాద్ సినిమాస్ సమర్పిస్తున్నాయి. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సి.కె. పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియాగా రాబోతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు టీజర్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ సినిమా కథ పురాణాల నేపథ్యంలో, తండ్రీకొడుకుల మధ్య సాగే భావోద్వేగపూరిత పోరాటంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు.
MOHANLAL – ‘VRUSSHABHA’ TEASER DROPS ON 18 SEPT 2025… The battles. The emotions. The roar… #Vrusshabha teaser arrives on Thursday [18 Sept 2025]… Featuring #Mohanlal [@Mohanlal] in the central role.
Shot simultaneously in #Malayalam and #Telugu, #Vrusshabha will also… pic.twitter.com/WrZ7Qw4iGz
— taran adarsh (@taran_adarsh) September 16, 2025