Vrushabha | మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన పాన్-ఇండియా చిత్రం ‘వృషభ’ (Vrushabha).
హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాను నంద కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏక్తా కపూర్ (బాలాజీ టెలిఫిల్మ్స్), ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ, తమిళం మరియు కన్నడ భాషల్లో డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ చూస్తుంటే.. మోహన్ లాల్ ఇందులో రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నాడు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ఈ ట్రైలర్ను మీరు చూసేయండి.