Mohanlal | ఒకవైపు ఎల్2 ఎంపురాన్ సినిమాతో విజయం అందుకున్నాడు మలయాళ స్టార్ మోహన్ లాల్. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ (Lucifer) సినిమాకి ఈ చిత్రం పార్ట్ 2గా వచ్చింది. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసుళ్లను రాబట్టింది.
అయితే ఈ సినిమా తర్వాత మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు లల్లెట్టన్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘తుడరుమ్’ (Thudarum). ఈ సినిమాకు మలయాళ పాపులర్ డైరెక్టర్, ఆపరేషన్ జీవా ఫేం తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తుండగా.. రెజపుత్ర విజువల్ మీడియా సమర్పణలో ఎమ్ రెంజిత్ నిర్మిస్తున్నారు.ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి శోభన కథానాయికగా నటిస్తుంది. ఇప్పటివరకు మోహన్ లాల్, శోభన కాంబోలో 55 సినిమాలు రాగా.. ఇది 56వ చిత్రంగా రాబోతుంది. మోహన్‌లాల్‌తో చివరిగా 1987లో నటించిన శోభన దాదాపు 38 ఏండ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మోహన్ లాల్ ఇందులో టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండగా.. అతడి కారు అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుంటుంది. అయితే ఆ సమస్య ఏంటి.. ఆ కారుని వదిలిపెట్టి మోహన్‌లాల్ ఒక్కక్షణం ఎందుకు ఉండలేడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. క్రైమ్ కామెడీగా ఈ చిత్రం రాబోతుంది.