Hridayapoorvam | మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam). ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది ఇప్పటికే ‘ఎల్2: ఎంపురాన్’ మరియు ‘తుడరుమ్’ వంటి యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలతో సూపర్ హిట్లను అందుకున్న లల్లెట్టన్ హృదయపూర్వం అంటూ క్రేజీ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహిస్తుండగా మోహన్ లాల్ సరసన మాళవిక మోహనన్ నటించారు. ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరుంబావూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఓనం పండుగ సందర్భంగా ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను వదిలింది చిత్రయూనిట్.