Manchu Mohan Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు షిరిడిలోని సాయిబాబాను దర్శించుకున్నాడు. మంగళవారం షిరిడీకి వెళ్లిన మోహన్ బాబు సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. తన నిర్మించిన ‘కన్నప్ప’ సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంలో, ఆ చిత్రం విజయవంతం కావాలని సాయిబాబా ఆశీస్సులు కోరినట్లు ఆయన వెల్లడించారు. ఇక దర్శనం తర్వాత, సాయి సంస్థాన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి భీమరాజ్ దరాడే మోహన్‌బాబును శాలువాతో సన్మానించి, సాయిబాబా విగ్రహాన్ని బహుకరించారు.
మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో సాటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభుదేవా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.