మంచు విష్ణు నిర్మిస్తూ.. నటిస్తున్న భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’. మహాపుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా ముఖేష్కుమార్సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ ప్రత్యేకపాత్రలు పోషిస్తుండటం విశేషం. న్యూజిల్యాండ్‌లో 90రోజుల పాటు జరిగిన చిత్రీకరణతో తొలి షెడ్యూల్ పూర్తయింది.
ఈ సందర్భంగా నిర్మాత, నటుడు డా.మోహన్‌బాబు తన ఎక్స్(ట్విటర్) ద్వారా షెడ్యూల్ విశేషాలు తెలిపారు. ‘న్యూజిలాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ చిత్రంలో 600 మంది హాలీవుడ్ నటులు కూడా నటించారు. థాయిలాండ్, న్యూజిలాండ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు. 90రోజుల పాటు అద్భుతమైన లొకేషన్స్‌లో ఆ పరమేశ్వరుడు, షిర్డీసాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకొని మన దేశానికి తిరిగి వస్తున్నాం’ అని ప్రకటించారు మోహన్‌బాబు.