Super Star Krishna | సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి సీనియర్ నటుడు మోహన్‌బాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కృష్ణ పార్థివదేహం వద్దకు వచ్చి సోదరా.. సోదరా.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయిన మోహన్‌బాబు.. కృష్ణ మృతదేహంపై పడి బోరున విలపించారు. అనంతరం మహేష్ బాబు, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడి ఓదార్చే ప్రయత్నం చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ (80) మంగళవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం తెలుగు సినీ చిత్ర పరిశ్రమనే కాకుండా ఘట్టమనేని కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
— Radoo (@Ungamma_ra) November 15, 2022