Mohan Babu | హైదరాబాద్ జల్పల్లిలో హైడ్రామా కొనసాగుతోంది. ప్రైవేటు బౌన్సర్ల సాయంతో గేట్లు తోసుకుంటూ మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో దాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దౌర్జన్యానికి దిగారు. ఓ జర్నలిస్టు చేతిలో నుంచి మైక్ లాక్కొని ఆవేశంగా అతనిపై దాడి చేశాడు.
మోహన్‌బాబు అకస్మాత్తుగా దాడి చేయడంతో అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు, బౌన్సర్లను బయటకు పంపించేశారు. ఈ ఘటన తర్వాత మోహన్‌బాబు, ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు.
మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో మోహన్‌బాబు గన్ను సీజ్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మోహన్‌బాబుతో పాటు మంచు విష్ణు వద్ద ఉన్న గన్ను కూడా సీజ్ చేయాలని ఆదేశించారు.
Thappu ledhu aa matram padali media batch ki#mohanbabumanchu #MohanBabu pic.twitter.com/kWQYSJVKT8
— చంటిగాడు లోకల్😎 (@Harsha_offl2) December 10, 2024