సీనియర్ హీరో మోహన్‌బాబు నటిస్తున్న తాజా చిత్రానికి ‘అగ్ని నక్షత్రం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై మోహన్‌బాబు, మంచు లక్ష్మీ నిర్మిస్తున్నారు. ప్రతీక్ ప్రజోష్ దర్శకుడు. ఈ సినిమాలో మోహన్‌బాబు ప్రొఫెసర్ విశ్వామిత్ర పాత్రను పోషిస్తున్నారు.. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ అన్యాయాల్ని సహించని డైనమిక్ సైకియాట్రిస్ట్ ప్రొఫెసర్‌గా మోహన్‌బాబు పాత్ర శక్తివంతంగా ఉంటుంది. మలయాళీ నటుడు సిద్ధిఖ్ విలన్‌గా నటిస్తున్నారు’ అని చెప్పారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ, సముద్రఖని, చైత్రశుక్ల, విశ్వంత్, జబర్దస్త్ మహేష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. లిజో కె జోస్ సంగీతాన్నందిస్తున్నారు.