Modi Hai Toh Mumkin Hai Song Troll | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాజకీయ రంగంలో కీలక పదవుల్లో సేవలందిస్తూ ఇటీవల 25 ఏళ్ల మైలురాయిని అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2000లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమై, 2014 నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతూ మోదీ జీ ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. అయితే మోదీ నాయకత్వాన్ని, విజన్‌ను కీర్తిస్తూ బాలీవుడ్‌కి చెందిన స్టార్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఒక పాటను విడుదల చేసింది. ‘మోదీ హై తో ముంకిన్ హై’ (Modi Hai Toh Mumkin Hai) అనే పాటను విడుదల చేయగా.. ఇందులో మోదీ పాలన గురించి వివరించారు. అయితే ఈ ప్రచార గీతం నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది. ఇది ‘పొలిటికల్ ప్రాపగాండా’ అని ప్రజల పన్ను డబ్బును (Tax Payers Money) ప్రధాని గత 11 ఏండ్లుగా వృథా చేస్తున్నాడని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ పాట మరో రికార్డును అందుకుంది.
యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాటకు వారం రోజుల్లోనే భారీ వ్యతిరేకతతో పాటు బ్యాక్లాష్ ఎదురవుతుంది. తాజాగా ఈ పాటకు 14 వేల లైక్స్ రాగా.. లక్షకి పైగా డిస్ లైక్స్(వ్యతిరేకంగా) వచ్చాయి. దీంతో మోడీపై వ్యతిరేకత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు జనాల నుంచి వ్యతిరేకత రావడంతో డిస్లైక్ బటన్ ఎంతమంది క్లిక్ చేశారు అనే ఆప్షన్ని హైడ్ చేశారు నిర్వహాకులు.
1.6M views
100k dislikes😭#ModiHaiTohMumkinHai pic.twitter.com/q5Co5ypNMa
— Mohit Chauhan (@mohitlaws) October 16, 2025
మరోవైపు ఇదే పాటను నెటిజన్లు రీమిక్స్ చేస్తూ.. రోడ్లపై ఉన్న గుంతలు (Potholes), మురికి కుప్పలను (Garbage Piles) చూపిస్తూ, మోదీ హై తో ముంకిన్ హై… అంటూ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు.
Let’s start a trend.
Capture the broken roads, crumbling infrastructure, rampant corruption, and filthy streets.
Add this song and post it on social media with the hashtag.#ModiHaiTohMumkinHai. pic.twitter.com/a6RXtWl1Ao
— Shruti Dhore (@ShrutiDhore) October 14, 2025