MM Keeravaani | లెజండరీ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎమ్. కీరవాణి ఆలపించిన ‘శ్రీ చిదంబరం’ చిత్రంలోని “వెళ్లేదారిలో..” అనే మెలోడీ సాంగ్ తాజాగా విడుదలైంది. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మాతలుగా వినయ్ రత్నం దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు కీరవాణి గారి గాత్రంలో వచ్చిన ఈ పాట సినిమాపై అంచనాలను పెంచేసింది. చందు రవి స్వరపరిచిన ఈ పాటకు చంద్రశేఖర్ అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. కీరవాణి గారు ఈ సినిమాకు తన అభినందనలు తెలుపుతూ పాటను విడుదల చేయడం విశేషం.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ కీరవాణి గారు తమ సినిమాలో పాట పాడటం తమకు దక్కిన గౌరవమని, ఆయన గాత్రం ఈ పాటకు ప్రాణం పోసిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇదొక స్వచ్ఛమైన వింటేజ్ విలేజ్ డ్రామా అని, ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుందని పేర్కొన్నారు. సినిమాలో హీరోను ఊరంతా చిదంబరం అని ఎందుకు పిలుస్తారు? అతను ఎప్పుడూ కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుని ఉంటాడు? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని వారు వివరించారు. గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కొత్తదనాన్ని కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ‘శ్రీ చిదంబరం’ ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని మిగుల్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.