మహమ్మద్ నజీర్, రిఫత్ రజూర్ జంటగా నటించిన మెలోడియస్ మ్యూజిక్ వీడియో ‘అప్నీ హద్ సే’. డైరెక్షన్, కొరియోగ్రఫీ హరి తాటిపల్లి అందించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ సాంగ్ వీడియోను విడుదల చేశారు. శాసనసభ్యులు నవీన్ యాదవ్ ఈ పాటని ఆవిష్కరించి మేకర్స్‌కు శుభాకాంక్షలు అందించారు.
బాలీవుడ్ గాయకుడు అభయ్ జోధ్‌పుర్కర్ ఆలపించిన ఈ సాంగ్ యువతను విశేషంగా ఆకట్టుకుంటుందని, ఉన్నత నిర్మాణ విలువలతో అద్భుతమైన విజువల్స్‌తో ఈ వీడియో సాంగ్‌ను రూపొందించామని హీరో మహమ్మద్ నజీర్ తెలిపారు. ఈ పాటకు సంగీతం: షారుఖ్ షేక్.