హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం రాజుకున్నది. ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా తారక్ అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ (NTR) సమాధి వద్ద నివాళులర్పించిన బాలకృష్ట.. అక్కడి నుంచి తిరిగివెళ్తూ ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) స్పందించారు.
తన అల్లుడు నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగిస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో పెద్ద ఎన్టీఆర్‌ను దించిన బాలకృష్ణ.. ఇప్పుడు తారక్ ఫ్లెక్సీల మీద పడ్డారని విమర్శించారు. బాలయ్య లాంటి వాళ్లు ఎంత మందివచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని స్పష్టం చేశారు. ఫ్లెక్సీలు తొలగించడం నీచమైన చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు, బాలకృష్ణలు తారక్‌ను ఏమీ చేయలేరని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ (NTR) వర్ధంతి నేడు. ఈ సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇక ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, కల్యాణ్ రామ్ నివాళులర్పించారు. మరోవైపు అక్కడికి తారక్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బాలకృష్ణ అతడి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి చేరుకున్నారు. ఆయన తన తండ్రికి అంజలి ఘటించారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీయించిన నందమూరి బాలకృష్ణ..#cbnkilledntr #JuniorNTR#IndraSenaReddy #NTR pic.twitter.com/2fkVGpQ7f3
— M.INDRASENAREDDY (@indrasena9966) January 18, 2024
ఇంతవరకూ బాగానే ఉన్నా.. బాలకృష్ణ వెళ్లిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన తారక్ ఫ్లెక్సీలను బాలయ్య అభిమానులు తొలగించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. బాలకృష్ణ సూచనల మేరకే వీటిని తొలిగించారనే ప్రచారం జరుగుతోంది. వాటిని వెంటనే తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశిస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దీనిపై తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
#JrNTR ఫ్లెక్సీలు ఎన్టీఆర్ ఘాట్ పరిసరాలలో లేకుండా చేయాలని #Balakrishna ఆదేశం
ఆదేశాల మేరకు ఫ్లెక్సీల ని తొలగించిన సిబ్బంది#NTR pic.twitter.com/gqOwBE6A2K
— Daily Culture (@DailyCultureYT) January 18, 2024