Tollywood | టాలీవుడ్లో విషాదం.. మిథునం ప్రొడ్యూసర్ కన్నుమూత
Tollywood | టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. మిథునం వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన మొయిద ఆనందరావు (57) కన్నుమూశారు. డయాబెటిస్తో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా వైజాగ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Tollywood | టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. మిథునం వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన మొయిద ఆనందరావు (57) కన్నుమూశారు. డయాబెటిస్తో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా వైజాగ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభిచారు. ఆ తర్వాత వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. సంఘసేవకుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. అందుకే తన స్వగ్రామంలో రూ.25 లక్షలు ఖర్చు చేసి ఓ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. సాహిత్యంపై కూడా ఆనందరావుకు మక్కువ ఎక్కువ. పర్యావరణ హిత పద్యాలను రాసి కోటిగాడు పేరుతో ప్రచురించేవారు. ఇక సినిమాల విషయానికొస్తే 2012లో మిథునం సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ కీలక పాత్రల్లో నటించారు. తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకుడు. కేవలం రెండే పాత్రలతో నడిచే ఈ సినిమా విమర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2017లో మిథునం చిత్రానికి నంది అవార్డు కూడా వరించింది. ఆనందరావు విషయానికొస్తే ఆయనకు భార్య పద్మినితో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Read More :
Pawan Kalyan | రోజుకు రెండు కోట్లు.. హాట్‌టాపిక్‌గా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్
Venu Yeldandi | ‘బలగం’ సినిమాకు మా కుటుంబమే స్ఫూర్తి : వేణు యెల్దండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

