Pawan Kalyan | రోజుకు రెండు కోట్లు.. హాట్‌టాపిక్‌గా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్
Pawan Kalyan Remuneration | తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానులు ఊగిపోతారు. పవన్ సినిమా రిలీజవుతుందంటే ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.
Pawan Kalyan Remuneration | తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానులు ఊగిపోతారు. పవన్ సినిమా రిలీజవుతుందంటే ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్ల దగ్గర భారీ కటౌట్లతో ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఇక ఆయన క్రేజ్‌కు తగ్గట్టే నిర్మాతలు పవన్‌కు ఎంత రెమ్యునరేషన్ అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. పవన్.. సినిమా ఒప్పుకుంటే చాలు బ్లాంక్ చెక్ మీద సైన్ చేసిచ్చే నిర్మాతలు కూడా ఉన్నారు. కాగా తాజాగా పవన్ తన రెమ్యునరేషన్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
తాజాగా పవన్.. జనసేన పదవ వార్షికోత్సవ సభలో తన పారితోషికం గురించి కీలకవ్యాఖ్యలు చేశాడు. డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదని, తనకు డబ్బులు అవసరం లేదని, అవసరం అయితే డబ్బులు ఇస్తానని పవన్ ఆ సభలో వెల్లడించాడు. ఈ రోజు ధైర్యంగా చెబుతున్నాను. ఇప్పుడు చేస్తున్న సినిమాకు 22 రోజులు కాల్షీట్లు ఇచ్చాను. ఆ సినిమాకు నేను తీసుకునే డబ్బు రోజుకు రెండు కోట్లు. ఇరవై రోజులు పని చేస్తే దాదాపు 45 కోట్లు తీసుకుంటాను. ప్రతి సినిమాకు అంత డబ్బు ఇస్తారని నేను చెప్పను. కానీ, నా యావరేజ్ స్థాయి అది. అది మీరు ఇచ్చిన స్థాయి. మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి. నాకు డబ్బులు అవసరం ఏముంది? నేను సంపాదించుకోలేని డబ్బులా? అని పవన్ జనసేన సభలో చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వినోదయ సిత్తం రీమేక్ చేస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. కాగా గతకొన్ని రోజులుగా ఈ సినిమాకు పవన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా పవన్ తన పారితోషికం గురించి స్వయంగా చెప్పడంతో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అయింది. పీపుల్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

