Telugu Movies | మార్చి మూడో వారం సినీ ప్రియులకు పండగే.. ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు ఇవే
March Third week Telugu Movie Releases | గతవారం బాక్సాఫీస్ చప్పగా సాగింది. ఒక్కటంటే ఒక్కటి కూడా నోటెబుల్ రిలీజ్ లేదు. కాస్తో కూస్తో బజ్‌తో రిలీజైన 'CSI సనాతన్' సినిమా కూడా రిలీజయ్యాక సైలెంట్ అయిపోయింది.
March Third week Telugu Movie Releases | గతవారం బాక్సాఫీస్ చప్పగా సాగింది. ఒక్కటంటే ఒక్కటి కూడా నోటెబుల్ రిలీజ్ లేదు. కాస్తో కూస్తో బజ్‌తో రిలీజైన ‘CSI సనాతన్’ సినిమా రిలీజయ్యాక సైలెంట్ అయిపోయింది. పాజిటీవ్ రివ్యూలే తెచ్చుకున్నా.. సినిమాపై అంత బజ్ లేకపోవడంతో ప్రేక్షకులు పట్టించుకోలేరు. దాంతో ఆది ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. అయితే ఓటీటీ ప్రియులు మాత్రం గతవారం పండగ చేసుకున్నాడు. ‘యాంగర్ టేల్స్’, ‘రానా నాయుడు’ వంటి సిరీస్‌లు తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. రానానాయుడికి నెగెటీవ్ రెస్పాన్స్ వచ్చినా ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులు మాత్రం బాగానే ఆదరిస్తున్నారు. అంతేకాకుండా గత నాలుగైదు రోజులుగా ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక మార్చి మూడో వారానికి వచ్చేశాం. ఈ వారం థియేటర్/ఓటీటీలో విందు పంచడానికి సిద్ధమవుతున్న సినిమాలు/వెబ్ సిరీస్‌లేంటో ఓ లుక్కేద్దాం.
థియేటర్లో రిలీజవుతున్న సినిమాలు

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి:
శ్రీనివాస్ అవసరాల దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమాతో మళ్లీ మెగాఫోన్ పట్టాడు. 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకు ఒక జంట ప్రేమ ప్రయాణం ఎలా సాగుతుంది అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నాగశౌర్య, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 17న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి.

కబ్జా:
కన్నడ స్టార్లు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘కబ్జా’. ఆర్.చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘కేజీఎఫ్’ తర్వాత ఆ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అనుకోని పరిస్థితుల్లో ఓ స్వాతంత్ర సమరయోధుడి కొడుకు మాఫీయా ప్రపంచంలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అని కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మార్చి 17న రిలీజ్ కానుంది.

షాజామ్-ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్:
సూపర్ హీరో ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మర్చి 17న రిలీజ్ కాబోతుంది. డేవిడ్ ఎఫ్.సాండ్బర్గ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డీసి కామిక్స్‌లోని షాజామ్ క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని తెరకెక్కింది.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు
ఆహా:
సత్తిగాని రెండెకరాలు (తెలుగు) – మార్చి 17

జీ5:
రైటర్ పద్మభూషణ్ – (తెలుగు) – మార్చి 17
యామ్ ఐ నెక్స్ట్ – (హిందీ) – మార్చి 17
సెవెన్ – (బెంగాలీ సిరీస్) – మార్చి 17
అమెజాన్ ప్రైమ్:
బ్లాక్ ఆడమ్ – (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 15
డోమ్ సీజన్ 2 – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 17
డిస్నీ+హాట్ స్టార్:
పాప్ కౌన్ – (హిందీ సిరీస్) – మార్చి 17

నెట్ ఫ్లిక్స్:
సార్ – (తెలుగు మూవీ) – మార్చి 17
మనీ షాట్: ద పోర్న్ హబ్ స్టోరీ – మార్చి 15
కుత్తే – (హిందీ) – మార్చి 16
షాడో అండ్ బోన్ సీజన్ 2 – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 16
కాట్ ఔట్: క్రైమ్, కరప్షన్, క్రికెట్ – (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మార్చి 17
ఇన్ హిజ్ షాడో – (ఇంగ్లీష్) – మార్చి 17
మాస్ట్రో (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 17
ది మేజీషియన్స్ ఎలిఫెంట్ – (ఇంగ్లీష్) – మార్చి 17
సోనీ లివ్:
రాకెట్ బాయ్స్ సీజన్ 2 – (వెబ్ సిరీస్) – మార్చి 16
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!


