Venu Yeldandi | ‘బలగం’ సినిమాకు మా కుటుంబమే స్ఫూర్తి : వేణు యెల్దండి
Venu Yeldandi | దాదాపు ఇరవై ఏండ్లుగా నన్ను ప్రేక్షకులు తెరపై చూస్తున్నారు. రెండు వందల చిత్రాల్లో నటించాను. అయితే రావాల్సినంత గుర్తింపు రాలేదు. నటిస్తూనే కథలు రాసే పనిలో నిమగ్నమయ్యాను. అలా కొన్ని చిత్రాలకు పనిచేశాను. వాటిలో రాసిన సన్నివేశాలు, మాటలకు పేరొచ్చింది.
Venu Yeldandi | బుల్లితెరతో పాటు దాదాపు రెండు వందల చిత్రాల్లో హాస్య నటుడిగా ప్రేక్షకుల్ని నవ్వించిన వేణు యెల్దండి దర్శకుడిగా మారి రూపొందించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. ఇటీవలే విడుదలైన ‘బలగం’ సినిమా ప్రేక్షకాదరణ పొందుతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర విజయంపై తాజా ఇంటర్వ్యూలో తన ఆనందాన్ని వ్యక్తపరిచారు వేణు యెల్దండి.
ఈ గుర్తింపు కోసమే ఎదురుచూశా
దాదాపు ఇరవై ఏండ్లుగా నన్ను ప్రేక్షకులు తెరపై చూస్తున్నారు. రెండు వందల చిత్రాల్లో నటించాను. అయితే రావాల్సినంత గుర్తింపు రాలేదు. నటిస్తూనే కథలు రాసే పనిలో నిమగ్నమయ్యాను. అలా కొన్ని చిత్రాలకు పనిచేశాను. వాటిలో రాసిన సన్నివేశాలు, మాటలకు పేరొచ్చింది. అలాంటప్పుడు నేనే దర్శకత్వం చేయవచ్చు కదా అనిపించింది. నాపై మరాఠీ, మలయాళ, తమిళ చిత్రాల ప్రభావం ఎక్కువ. వాటిలో సహజత్వం ఉంటుంది. నటనకు ఆస్కారమూ ఎక్కువే. అలాంటి కథను రాయాలని ప్రయత్నించాను.
‘బలగం’ కథకు కుటుంబమే స్ఫూర్తి
మా ఇంట్లో నేను తొమ్మిదో సంతానం. మాది పెద్ద కుటుంబం. బంధువులు చాలా మంది ఉండేవారు. ఇంట్లో ఏ కార్యక్రమం చేసుకున్నా జాతరలా జరిగేది. మా నాన్న చనిపోయినప్పుడు సంప్రదాయంగా జరిపే కొన్ని కార్యక్రమాలు చేశాం. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏడుపులు, పెడ బొబ్బలు, తినడాలు, తాగడాలు, మళ్లీ ఏడవటాలు వంటివి చూశాను. ఇవన్నీ నాలో బలగం కథ గురించిన ఆలోచన పుట్టించాయి. ఈ చిత్రంలోని కొమురయ్య పాత్రకు మా పెదనాన్న రాఘవులు స్ఫూర్తి. మా పెదనాన్న, పెద్దమ్మ చనిపోయినప్పుడు ఊరెళ్లి మా అన్నను ఓదార్చాను. ఆయన నాతో తమ్ముడూ..అమ్మా నాన్నలది 80 ఏండ్ల అనుబంధం. నాన్న వెళ్లిపోయాడు. ఆయన ఎడబాటు తట్టుకోలేక అమ్మ ఆయన కోసం వెళ్లింది. మాకేం బాధ లేదు అన్నాడు. ఆ మాటతో నాలో ఆలోచన మొదలైంది. ఇదే నా కథలో కీలకంగా తీసుకున్నా. మిత్రులు నన్ను దిల్ రాజు దగ్గరకు తీసుకెళ్లారు. ఆయనకు కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ దిల్ రాజు ప్రొడక్షన్స్‌లోకి వచ్చింది.
చిరంజీవి ప్రశంస మర్చిపోలేను
సినిమా రూపకల్పన నేను పుట్టి పెరిగిన సిరిసిల్లలోనే చేశాను. మా సినిమా చూసి చిరంజీవి గారు ఇచ్చిన ప్రశంసలు మర్చిపోలేను. మా సినిమాకు కమర్షియల్‌గా ఇంత భారీ వసూళ్లు రావడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ కారణం. సినిమాకు దిల్ రాజు గారు చెప్పిన అనేక సూచనలు ఇవాళ తెరపై వర్కవుట్ అయ్యాయి. ఓటీటీ సినిమాల సక్సెస్ ఈ సినిమా చేసేందుకు నాకు ధైర్యాన్ని, స్ఫూర్తినిచ్చాయి. ఇకపై దర్శకత్వంతో పాటు నటుడిగానూ కొనసాగుతాను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

