Natu Natu Song | ‘నాటు నాటు’కు ఆస్కార్.. అవార్డును కొన్నారంటూ బాలీవుడ్ బ్యూటీ మేకప్ ఆర్టిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు..!
Natu Natu Song | భారతీయ సినిమా పరిశ్రమకు మార్చి 12 మరుపురాని రోజు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా జరిగిన 95వ అకాడమీ అవార్డుల్లో రెండు భారతీయ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు వరించాయి. ష్టార్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్’, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌కు అవార్డులు వరించాయి.
Natu Natu Song | భారతీయ సినిమా పరిశ్రమకు మార్చి 12 మరుపురాని రోజు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా జరిగిన 95వ అకాడమీ అవార్డుల్లో రెండు భారతీయ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు వరించాయి. ష్టార్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్’, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌కు అవార్డులు వరించాయి. చాలాకాలం తర్వాత భారత్‌కు రెండు ఆస్కార్ అవార్డులు రావడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలువురి విమర్శలు అందుకున్నది. అయితే, ఇదే సమయంలో సినిమాకు వచ్చిన పాపులారిటీ, అవార్డులపై పలువురు అక్కసు వెళ్లగక్కుతున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముత్తతిల్ ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ రావడంపై ఓ పోస్ట్ పెట్టాడు. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ షాన్ ఏమని కామెంట్ చేశాడంటే.. ‘ఇండియాలో అవార్డులు మాత్రమే కొనవచ్చని నేను భావించాను. కానీ, ఆస్కార్ అవార్డులు అమ్ముడవడం చూస్తున్నాను! అంతా డబ్బుతోనే జరుగుతుంది. మన దగ్గర డబ్బుంటే ఏదైనా పొందవచ్చు’ అంటూ వ్యాఖానించాడు. దాంతో సాన్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు నటి అనన్య ఛటర్జీ సైతం ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావడంపై ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ‘‘నాటు నాటు’ సాంగ్‌ను చూసి ఎందుకు గర్వపడాలి? నాకు అర్థం కావడం లేదు. ఈ పాట గురించి నిజంగా గర్వించాలా? మనం ఎక్కడికి వెళ్తున్నాం’ అంటూ కామెంట్ చేసింది.
ఇదిలా ఉండగా.. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం గతేడాది విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. 15 పాటలతో పోటీపడి.. చివరకు అవార్డును గెలుచుకున్నది. అందుకు ముందు ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును సైతం అందుకున్న విషయం తెలిసిందే. ఆస్కార్ అందుకున్న చిత్ర బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఇంకా వేదికపై సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైఫ్ పర్ఫామెన్స్‌కు స్టాండింగ్ ఒవేషన్‌ను దక్కింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

