Mitra Mandali | టాలీవుడ్ నటుడు ప్రియదర్శి మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గీతా ఆర్ట్స్ 2 బాధ్యతల నుంచి విరామం తీసుకున్న నిర్మాత బన్నీ వాస్, తన సొంత బ్యానర్ బన్నీ వాస్ వర్క్స్‌ని ప్రారంభించి, దానిలో మొదటి సినిమాగా మిత్రమండలి అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ వాసు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. సప్త అశ్వ మీడియా వర్క్స్ మరియు వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ నిహారిక NM కథానాయికగా నటించబోతుంది. ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాతో ఎస్ విజయేంద్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమా బ్యాండ్ ట్రూప్ నేపథ్యంలో రాబోతున్నట్లు తెలుస్తుంది.