“మిత్రమండలి’ మంచి కథ. నాకు నచ్చిన కథ. మూడు నెలల క్రితం ‘లిటిల్‌హార్ట్స్’ టీమ్ తమ సినిమాను విడుదల చేయమని నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మా ‘మిత్రమండలి’ ట్రైలర్ ఈవెంట్ కోసం నేను వాళ్లని పిలిచాను. నిజమైన విజయం అంటే ఇది. తప్పకుండా ‘మిత్రమండలి’కూడా భారీ విజయాన్ని సాధిస్తుంది.’ అని నిర్మాత బన్నీవాసు నమ్మకం వెలిబుచ్చారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రధారులుగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘మిత్రమండలి’. విజయేందర్ ఎస్. దర్శకుడు. కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు.
ఈ నెల 16న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో బన్నీవాస్ మాట్లాడారు. ‘లిటిల్‌హార్ట్స్’ టీమ్ ఈ చిత్రం ట్రైలర్‌ని ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించింది. ‘జాతిరత్నాలు’ కంటే రెట్టింపు నవ్వులు పంచే సినిమా ఇదని ప్రియదర్శి చెప్పారు. తొలి సినిమాలోనే మంచి పాత్ర చేసే అదృష్టం కలిగిందంటూ నిహారిక ఎన్.ఎం.ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఆద్యంతం వినోదభరితంగా, నవ్వించడమే పరమావధిగా ఈ ట్రైలర్ సాగింది.