ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న కామెడీ ఎంటైర్టెనర్ ‘మిత్రమండలి’. కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్‌రెడ్డి తీగల కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా విజయేందర్.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ విషయాన్ని సోమవారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. దీపావళికి రెండు రోజుల ముందుగా విడుదల అవుతున్న ఈ చిత్రం థియేటర్లలో నవ్వుల టపాసులు పేల్చనున్నదని, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయని, నవ్వుల పండుగకు నమూనాలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ ఎస్.జె, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్, సమర్పణ: బన్నీవాస్ (బి.వి.వర్క్స్), నిర్మాణం సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటైర్టెన్మెంట్స్.