అగ్రహీరో రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రాన్ శర్మ కథానాయిక. గౌరి రోణంకి దర్శకత్వంలో జె.జె.ఆర్.రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రంలోని పాటను సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
‘కావాలయ్యా.. నువ్వే కావాలయ్యా..’ అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రాయగా, అనూప్‌రూబెన్స్ స్వరపరిచారు. గాయని మంగ్లీ ఆలపించారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్యామ్, వంశీ, కెమెరా: రామ్‌రెడ్డి, సమర్పణ: యలమంచి రాణి.