Tom Cruise – Mission Impossible | హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ నటించిన ‘మిషన్: ఇంపాజిబుల్ – ఫైనల్ రెకనింగ్’ చిత్రం భారత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాను మొదటగా.. మే 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్రబృందం తాజాగా విడుదల తేదీని మారుస్తూ.. ఆరు రోజుల ముందుగానే తీసుకోస్తుంది.
హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ (Tom Cruise) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ (Mission Impossible The final Reckoning). స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న అ చిత్రానికి క్రిస్టోఫర్ మేక్‌క్వారీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను మొదటగా.. మే 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ తేదీని మారుస్తూ.. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీని చెప్పిన డేట్ కంటే ఆరు రోజుల ముందుగానే మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల యొక్క అధిక అంచనాలు, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పారామౌంట్ పిక్చర్స్ తెలిపింది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.
#MissionImpossible – The Final Reckoning now releases early in India.
New date – 17th May.
Releasing in English, Hindi, Tamil & Telugu! pic.twitter.com/rUkNCtoEic— Paramount India (@ParamountPicsIN) April 25, 2025