.
హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ క్రూజ్ నటిస్తున్న తాజా చిత్రం మిషన్ ఇంపాజిబుల్ 7. కరోనా వలన చిత్ర షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్ . వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. అంటే సరిగ్గా ఏడాది తర్వాత ఈ చిత్రాన్ని థియేటర్లో చూడనున్నాం.
ఇక కొద్ది రోజుల క్రితం బర్మింగ్హమ్(ఇంగ్లండ్)లో మిషన్ ఇంపాజిబుల్ ఏడో పార్ట్ షూటింగ్ జరిగింది. ఓ లగ్జరీ హోటల్లో సినిమా యూనిట్ బస చేసింది. అయితే కారు బయట పార్కింగ్ చేసిన కాస్ట్లీ కారును దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. కారు చోరీకి గురైందని గుర్తించిన టామ్ క్రూజ్ బాడీగార్డులు.. పోలీసులకు సమాచారం అందించారు.
ట్రాకింగ్ సిస్టమ్ ఆధారంగా ట్రేస్ చేసి.. స్మెత్విక్ విలేజ్‌లో కారును గుర్తించారు. అయితే కారు దొరికినప్పటికీ.. అందులో లగేజీ, కొంత డబ్బు మాయమైనట్లు తెలుస్తోంది. దాదాపు కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ ఎక్స్7.. 4.4 లీటర్ V8 ఇంజిన్, 523 హార్స్ పవర్ ఇంజిన్, నాలుగు సెకన్లలో 96 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకునే సామర్థ్యం ఉంది.