క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వంలో టామ్ క్రూజ్ హీరోగా తెరకెక్కుతున్న హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ 7. ఈ సినిమా షూటింగ్లో కరోనా కలకలం సృష్టించినట్టు హాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. నైట్‌క్లబ్‌లో షూటింగ్ జరగాల్సి ఉండగా.. ముగ్గురు డ్యాన్సర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా, పదకొండు మంది కరోనా బారిన పడినట్టు తెలుస్తుంది. ఇందులో టామ్ క్రూజ్ ఉన్నాడని టాక్. అయితే బ్రిటిష్ టాబ్లాయిడ్స్ మాత్రం కేవలం సిబ్బంది మాత్రమే కరోనా బారిన పడ్డారని చిత్ర యూనిట్ అంతా ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొంది.
కొందరు సిబ్బందికి పాజిటివ్ తేలడంతో షూటింగ్‌కు నిలిపివేసినట్లు పారామౌంట్ పిక్చర్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. జూన్ 14న తిరిగి షూటింగ్ ప్రారంభిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. మిషన్ ఇంపాజిబుల్ 7 చిత్రానికి కరోనా పెద్ద దెబ్బ వేసింది. పలుమార్లు ఈ షూటింగ్‌కు అంతరాయం ఏర్పడగా, వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.