Kanappa Film Hard Drive | మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించి ఓ కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కన్నప్ప చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన దృశ్యాలు, డేటా ఉన్న హార్డ్ డ్రైవ్ మాయం అయినట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నిర్మాణ సంస్థ నమ్మక ద్రోహం కేసు కూడా నమోదు చేసింది. సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత రెడ్డి విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలావుంటే మిస్ అయిన హార్డ్ డిస్క్కి సంబంధించి కీలక సమాచారం బయటపడింది. ఈ హార్డ్ డిస్క్‌లో సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ దాదాపు 30 నిమిషాల పాటు కనిపించనున్నారని మంచు విష్ణు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని, ఆయన స్క్రీన్టైమ్ సినిమా కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ముఖ్యంగా, మోహన్ బాబు, ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాలు అత్యద్భుతంగా ఉంటాయని విష్ణు పేర్కొన్నారు. ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో హార్డ్ డిస్క్ మాయం కావడంతో చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళనలో ఉంది. హార్డ్ డిస్క్ బ్యాకప్ పెట్టుకున్న కూడా.. ఎవరైనా ఆన్లైన్లో లీక్ చేస్తే.. ఎలా అని చిత్రబృందం ఆందోళన పడుతుంది.