Miss Shetty Mr Polishetty | మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సక్సెస్ ఈవెంట్ వేదిక ఖరారు.. స్పెషల్ గెస్ట్ ఎవరంటే
Miss Shetty Mr Polishetty | నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty). సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతుంది.
Miss Shetty Mr Polishetty | నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty). సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతుంది. మొదట ఈ సినిమా పేరు జనాలకు అంతగా రిజిస్టర్ అవ్వలేదు. పైగా దానికి తోడు షారుఖ్ ఖాన్ జవాన్ (Shah Rukh Khan Jawan) సినిమాకు పోటీగా దింపడంతో ఈ సినిమా కొట్టుకుపోవడం ఖాయం అని అనుకున్నారు. తొలిరోజు అదే జరిగింది కూడా. జవాన్ దాటికి ‘మిస్ శెట్టి’ పేరు కూడా ఎక్కడ వినిపించలేదు. అయితే మెల్లిగా ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో కొంచెం కొంచెంగా పుంజుకుంది. ఇక శని, ఆదివారాలు వచ్చే సరికి కొన్ని చోట్ల టిక్కెట్లు దొరకని పరిస్థితి కూడా ఏర్పడింది. అంతలా సినిమా పికప్ అయింది. దానికి తోడు రిలీజ్‌కు ముందు చిరు, రిలీజ్ తర్వాత మహేష్, రాజమౌళి రివ్యూలు కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. తాజాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ ఈవెంట్‌కు సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా సక్సెస్ ఈవెంట్(Miss Shetty Mr Polishetty Success Event)ను ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్ (Daspalla Hotel)లో నిర్వహించనున్నట్లు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) సోషల్ మీడియాలో వెల్లడించారు. దీనితో ఒక స్పెషల్ నోట్ పెట్టాడు.
”అసలు స్వచ్ఛమైన నోటి మాట ద్వారా ఈ సినిమాను ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. మీరు గ్రేట్ అండి. ఈ హ్యాట్రిక్ (ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి) హిట్ ఇచ్చినందుకు మీ అందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విజయాన్ని జరుపుకోవడానికి ఈరోజు సాయంత్రం హైదరాబాద్ దసపల్లా హోటల్‌కి రండి. స్పెషల్ గెస్ట్‌లు వస్తున్నారు. ప్రేమ, నవ్వుతో జరుపుకుందాం అంటూ నవీన్ రాసుకోచ్చాడు. ఇక స్పెషల్ గెస్ట్‌లు ఎవరనేది నవీన్ సస్పెన్స్‌లో ఉంచాడు.
Asalu pure word of mouth to #MissShettyMrPolishetty blockbuster chesaru. Meeru great andi 🙏Personally I want to thank each and everyone of you for giving this hatrick hit. Come to daspalla hotel today evening Hyderabad to celebrate this success. Surprise guests will be there .… pic.twitter.com/jESWzJnUnC
— Naveen Polishetty (@NaveenPolishety) September 16, 2023
కాగా మరోవైపు ఈ సినిమా ఓటీటీ హక్కులను ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను ‘జీ’ (ZEE) టీవీ సొంతం చేసుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

