Misha Agarwal | ఇటీవలి కాలంలో చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారు. సోషల్ మీడియా కొంతమందిని ఒకేసారి పైకి లేపుతుంది. అలానే మరికొందరిని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. కొందరు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వలన ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ ఫాలోవర్స్ తగ్గారని సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయింది. తన 25వ బర్త్ డేకు 2 రోజుల ముందు అంటే ఏప్రిల్ 24న సూసైడ్ చేసుకున్నారు. చిన్న వయసులోనే ఆమె అలాంటి దారుణానికి ఒడిగట్టడం అందరిని ఆందోళనకు గురి చేసింది.
మిషా అగర్వాల్ ఆత్మహత్య గురించి స్పందించిన వారి కుటుంబ సభ్యులు.. తన ఫాలోవర్స్ తగ్గారనే సూసైడ్ చేసుకున్నారని చెప్పుకొచ్చింది. మిషా తన ఇన్ స్టా ఫాలోవర్లే ప్రపంచం అనుకుంది.. 10 లక్షల మంది ఫాలోవర్స్‌ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. అయితే, ఆమె అనుకున్న దాని కంటే ఫాలోవర్స్ తగ్గుతూ రావడంతో ఏకంగా డిప్రెషన్లోకి వెళ్లి సూసైడ్ చేసుకుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇన్‌స్టా ఫాలోవర్స్ డ్రాప్ అవుతుంటే, నా కెరీర్ ముగిసినట్టే అని తరచూ బాధపడేది. ఏమి కాదని మేము ఓదార్చేవాళ్లం. ఎల్ఎల్బీ కంప్లీట్ చేసి పీసీఎస్జేకు ప్రిపేర్ అవుతున్నావ్ కదా, త్వరలోనే జడ్జివి అవుతావు అని ధైర్యం చెప్పేవాళ్లం. కాని ఇన్స్టాగ్రామ్ కోసం ప్రాణాలు తీసుకునే వరకూ వెళ్తుందని మేం అనుకోలేదు అంటూ మిషా అగర్వాల్ కుటుంబ సభ్యులు అన్నారు.
అయితే దీనిపై తాప్సీ స్పందిస్తూ.. ఇలాంటి రోజు వస్తుందని నేను ముందే భయపడ్డాను. ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియాపై ఉన్న క్రేజ్ చూసి ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడో భయపడ్డా. మన లైఫ్‌ను మనం ప్రేమించడం కన్నా ఫాలోవర్స్ సంఖ్యకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాం. చుట్టూ ఉన్న వారు చూపించే నిజమైన లవ్ కంటే ఆన్ లైన్ ప్రేమకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నామని భయపడ్డా. అలాగే మనం కష్టపడి ఎన్నో ఏళ్ల పాటు చదువుకున్న డిగ్రీలను లైక్స్, కామెంట్స్ అధిగమిస్తాయని ఎప్పుడో ఊహించాను. నిజంగా ఈ ఘటన నా గుండె బద్దలయ్యేలా చేసింది. నిజంగా బాధాకరం అంటూ పోస్ట్ పెట్టింది తాప్సీ.