Mirzapur 3 | ఇండియన్ టాప్ టెన్ వెబ్ సిరీస్‌లలో ఫస్ట్ గుర్తోచ్చే క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘మీర్జాపూర్’ (Mirzapur). ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు సీజన్లు రాగా.. తాజాగా మూడో సీజన్ ‘మీర్జాపూర్ 3’ (Mirzapur 3) రాబోతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘మీర్జాపూర్ 3’ టీజర్‌తో పాటు టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
సీజన్ 2 ముగింపులో మున్నా(దివ్యేందు శర్మ) గుడ్డు (అలీ ఫజల్) చేతిలో చనిపోతాడు. అయితే మున్నా చనిపోయన అనంతరం మీర్జాపూర్ సింహాసనం గుడ్డు వశం అవుతుంది. ఇక గుడ్డుని చంపి మీర్జాపూర్‌ను దక్కించుకోవాలని అక్కడి లోకల్ గ్యాంగ్స్ చూస్తుంటాయి. ఈ క్రమంలోనే గుడ్డు ఏం చేశాడు అనేది సీజన్ 3 స్టోరీ అని తెలుస్తుంది. పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్, హర్షిత గౌర్, విజయవర్మ తదితరులు నటిస్లున్న ఈ వెబ్ సిరీస్‌కు గుర్మీత్‌సింగ్, ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సీజన్ 3 జూలై 05 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Jungle mein bhaukaal machne wala hai!🔥#MirzapurOnPrime, July 5@TripathiiPankaj @alifazal9 #battatawada @RasikaDugal @MrVijayVarma @itsishatalwar @HarshitaGaur12 @an_3jum @rajeshtailang @gurmmeet @ritesh_sid @FarOutAkhtar @J10kassim @vishalrr @excelmovies pic.twitter.com/NfzaUAYbPp
— prime video IN (@PrimeVideoIN) June 11, 2024