‘గేమ్ చేంజర్’ పూర్తి చేసి, ‘RC16’ షూటింగ్లో బిజీ అయిపోయారు రామ్‌చరణ్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మైసూర్లో మొదలైన విషయం తెలిసిందే. ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ఇండియా ప్రాజెక్ట్‌పై అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి.
హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ అగ్రనటుడు శివరాజ్‌కుమార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ నటుడు ‘మీర్జాపూర్’ఫేం దివ్యేందు శర్మ కూడా ఈ సినిమాలో భాగం అయ్యారు.
‘మీర్జాపూర్’లో మున్నాభాయ్‌గా తనదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిన దివ్యేందు.. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తూ శనివారం ఆయన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది. మెలితిప్పిన మీసంతో రగ్గ్డ్గా ఈ లుక్‌లో దివ్యందు కనిపిస్తున్నారు. ఈ స్క్రిప్ట్‌లో తనకెంతో ఇష్టమైన పాత్ర ఇదేనని ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు తెలియజేశారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్.