Mirai | తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘మిరాయ్’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ కాగా, బుకింగ్స్ కూడా దానికి తగ్గట్టుగానే జరిగాయి.అయితే విడుదలకు కొన్ని గంటల ముందే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ‘మిరాయ్’లో రెండు స్పెషల్ సర్ప్రైజ్లు ఉన్నాయని హీరో తేజ సజ్జా ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రకటించారు.
దీంతో ఎవరు క్యామియో చేస్తారు? అనేది ప్రేక్షకుల్లో పెద్ద చర్చగా మారింది. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, రవితేజ పేర్లు వినిపించినా.. తాజాగా ప్రభాస్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. తేజ సజ్జా ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ..“మిరాయ్ కొన్ని గంటల్లో మీ ముందుకు రాబోతోంది. పెద్ద మనసు కలిగిన ప్రభాస్ గారికి కృతజ్ఞతలు. బిగినింగ్ లో రెబలియస్ సర్ప్రైజ్ మిస్ అవ్వకండి” అని పేర్కొన్నారు. అదే సమయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కూడా “రాజు అంటే రెబలేరా.. రెబల్ అంటే రాజేరా.. మిరాయ్ బిగినింగ్ మిస్ కాకండిరా”* అంటూ ట్వీట్ చేయడంతో ప్రభాస్ అంశంపై క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం సినీ అభిమానులు ప్రభాస్ సినిమాలో స్పెషల్ క్యామియో చేశారా? లేక వాయిస్ ఓవర్ అందించారా? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ ఫ్యాక్టర్ ‘మిరాయ్’కు అదనపు బలాన్ని ఇస్తుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది. మరి రెబల్ స్టార్ పాత్ర ఏంటనేది కొన్ని గంటల్లోనే తెలియనుంది.ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఆయన ఇప్పుడు పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ది రాజా సాబ్ చిత్రంతో సంక్రాంతికి పలకరించనున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.